మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక

Aug 14 2026 7:50 AM | Updated on Aug 14 2026 7:50 AM

కొల్లాపూర్‌: కొల్లాపూర్‌ మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం గురువారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం కమిషనర్‌ శంకర్‌ సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నలుగురు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు గాను సభకు హాజరైన 15 మంది కౌన్సిలర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ ఏకపక్షంగా ఓటేశారు. సభకు కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ శ్రీదేవి, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ సాయిరాంయాదవ్‌ గైర్హాజరయ్యారు. కోఆప్షన్‌ సభ్యులు మాజీ ప్రజాప్రతినిధుల కోటాలో మేకల శిరీషయాదవ్‌, పిన్నంశెట్టి శేఖర్‌, మైనార్టీ వర్గం నుంచి మాజీ కౌన్సిలర్‌ నయీం, 8 వ వార్డుకు చెందిన నస్రీన్‌బేగం ఎన్నికయ్యారు. కోఆప్షన్‌ సభ్యుల పదవీ కోసం మొత్తం 6 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో మాజీ కౌన్సిలర్‌ రాముడుయాదవ్‌, సీపీఐ నాయకులు యూసూఫ్‌బాబా కూడా ఉన్నారు. కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికై న వారిని మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement