నాగర్‌కర్నూల్‌ | - | Sakshi
Sakshi News home page

నాగర్‌కర్నూల్‌

Aug 14 2026 7:50 AM | Updated on Aug 14 2026 7:50 AM

న్యూస్‌రీల్‌

1,056 చెరువులు,

కుంటలు..

ఆయకట్టు సాగు..
ఎన్నిరోజులో నీరు

సీతాఫలాలపై అధ్యయనం

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో సీతాఫలాలు అధికంగా లభించే ప్రాంతాల్లో కొత్త రకాలపై ప్రత్యేక బృందం అధ్యయనం చేస్తోంది.

శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026

–8లో u

నాగర్‌కర్నూల్‌: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదని ఆందోళన చెందుతున్న జిల్లా రైతాంగానికి.. శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద కొంత ఉపశమనం కలిగించింది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుతుండగా కేఎల్‌ఐ ద్వారా సాగునీరు వదలడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. గుడిపల్లి రిజర్వాయర్‌ నుంచి నాలుగు రోజుల కిందట అధికారులు నీరు విడుదల చేయగా.. రెండు ప్రధాన కాల్వల ద్వారా డిస్ట్రిబ్యూటర్లలో నీరు పారుతోంది. వీటితో గొలుసుకట్టు చెరువులు నిండే అవకాశాలు ఉన్నాయి. అయితే కాల్వలకు నీళ్లు వస్తున్నాయని ఆనందపడుతున్న రైతులకు.. వీటిని ఎప్పటి వరకు వదులుతారోనన్న ఆందోళన వెంటాడుతోంది. ఇప్పటికే జూరాల, భీమా కాల్వలకు నీరు నిలిపివేశారని తెలుస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ప్రతిరోజూ వివిధ మార్గాల ద్వారా 12 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తుంది. ఇక ఉమ్మడి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో బుధవారం వనపర్తిలో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలోనూ పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడించలేదు. అయితే రైతులు ఆరుతడి పంటలే సాగు చేసేలా చూడాలని సూచించారు. దీంతో సాగునీరు ఎప్పటి వరకు విడుదల అవుతుందో స్పష్టత లేకుండాపోయింది.

జిల్లాలో 1,056 చెరువులు, కుంటలు ఉండగా.. ప్రధాన చెరువులు 36 ఉంటాయి. వీటిలో చాలా చెరువులు, కుంటలు కేఎల్‌ఐ నీటితో నిండే అవకాశం ఉంది. అయితే రెండు నెలలకుపైగా నీరు కాల్వల ద్వారా విడుదల చేస్తే ఆయా చెరువుల్లోకి నీరు చేరుతుంది. ఒకవేళ వీటిని మధ్యలోనే ఆపేస్తే మాత్రం చెరువులు నిండవు. ప్రస్తుతం కాల్వల్లో పారుతున్న నీటిని రైతులే వినియోగించుకుంటారు. చెరువులు నిండితే భూగర్భజలాలు పెరిగి సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు ఉన్న పంటలు పండుతాయన్న నమ్మకం కలుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement