రికవరీ అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

రికవరీ అంతంతే..

Aug 13 2026 1:33 AM | Updated on Aug 13 2026 1:33 AM

బకాయి చెల్లించాల్సిందే..

రూ.5కోట్ల నుంచి

రూ.21కోట్ల వరకు..

2022–23 సీఎంఆర్‌ బకాయి చెల్లింపుల్లో మిల్లర్ల తాత్సారం

నాగర్‌కర్నూల్‌: జిల్లాలో 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ ధాన్యం బకాయి అంతంతమాత్రంగానే వసూలైంది. ప్రభుత్వం మిల్లర్లపై ఒత్తిడి పెంచి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో పాటు 90 రోజుల గడువు (ఈ నెల 6వ తేదీ వరకు) విధించగా.. కొందరు మిల్లర్లు మాత్రమే బకాయి సొమ్ము చెల్లించేందుకు ముందుకొచ్చారు. మొత్తం రూ. 250కోట్ల బకాయిలకు గాను రూ. 54.91కోట్ల వరకు మాత్రమే వసూళ్లయ్యాయి. మరో రూ. 195.73 కోట్ల బకాయి మిగిలింది. వీటిని వసూలు చేయడానికి ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే మి ల్లర్లు కోర్టుకు వెళ్లడం.. రెండు రోజుల్లో తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో కొంత జాప్యం జరుగుతోంది. కోర్టు తీర్పు తర్వాతే ప్రభుత్వం మిల్లర్లపై చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

1.61,009 మెట్రిక్‌ టన్నుల ధాన్యం అప్పగింత..

జిల్లాలోని 72 రైస్‌మిల్లులు, 11 పారాబాయిల్డ్‌ మిల్లుల నిర్వాహకులు 2022–23లో యాసంగిలో పండిన 1.61,009 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. వీటిని సీఎంఆర్‌ రూపంలో ప్రభుత్వానికి అందించాల్సి ఉండగా.. కొందరు మిల్లర్లు 18,960 మెట్రిక్‌ టన్నులను మరాడించి, ప్రభుత్వానికి అప్పగించారు. మరో 22,047 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని వేలం వేశారు. ఇంకా దాదాపు 1,11,395 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద ఉంది. ఆ ధాన్యం విలువను ప్రభుత్వం రూ.250 కోట్లుగా లెక్కించింది. అయితే సీఎంఆర్‌ అప్పగించేందుకు మిల్లర్లు విముఖత వ్యక్తం చేయడంతో డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం చాలా రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేస్తోంది. జిల్లాలో 8 మిల్లులపై కేసులు సైతం నమోదయ్యాయి. మరికొన్ని సీజ్‌ అయ్యాయి.

జిల్లాలో సీఎంఆర్‌ బకాయి పడిన మిల్లులన్నీ ప్రభుత్వ ఆదేశాల మేరకు చెల్లించాల్సిందే. మొత్త రూ. 250కోట్ల బకాయిలో రూ. 55కోట్ల వరకు వసూళ్లు అయ్యాయి. మిగతాది సైతం చెల్లించక తప్పదు. లేనిచో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

– రాజయ్య, జిల్లా సివిల్‌ సప్లయ్‌ మేనేజర్‌

జిల్లాలో ఉన్న 82 మిల్లుల్లో 10 మిల్లుల నిర్వాహకులు ఎక్కువ బకాయి చెల్లించాల్సి ఉంది. మిగిలిన మిల్లులు రూ.5 కోట్లలోపు చెల్లించాల్సి ఉందని సమాచారం. అత్యధికంగా లక్ష్మీనారాయణ అగ్రి ఇండస్ట్రీస్‌ తాడూరు రూ. 21కోట్ల బకాయి ఉండగా.. పద్మావతి కొండారెడ్డిపల్లి మిల్లు రూ. 18.70 కోట్లు, శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఇండస్ట్రీస్‌ అచ్చంపేట రూ.15.12 కోట్లు, మహాలక్ష్మి పారాబాయిల్డ్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌ నాగర్‌కర్నూల్‌ రూ. 11.49కోట్లు, ఏఎంఆర్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ ఉప్పరిపల్లి రూ. 9.81 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మిల్లులకు చెల్లించే వర్కింగ్‌ చార్జీలు, మిల్లింగ్‌, రవాణా, ఇతరత్రా చార్జీలు రూ. లక్షల్లో బకాయి ఉంది. వాటిని వెంటనే చెల్లించడంతో పాటు వాయిదాల పద్ధతి ఇస్తే బకాయిలు చెల్లిస్తామని రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి తెలిపారు.

రూ.250కోట్లకు గాను రూ.54.91కోట్లు వసూలు

ఇంకా పెండింగ్‌లో రూ.195.73కోట్లు

మిల్లర్లపై ఒత్తిడి పెంచిన అఽధికారులు

వాయిదా పద్ధతి ఇవ్వాలంటూ

విన్నపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement