నకిలీ.. మకిలీ | - | Sakshi
Sakshi News home page

నకిలీ.. మకిలీ

Jul 19 2026 2:02 AM | Updated on Jul 19 2026 2:02 AM

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కరువు మేఘాలు కమ్ముకుని.. వానాకాలం సాగుపై ఇప్పటికే సందిగ్ధత కొనసాగుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతాంగంలో నిరాశ వ్యక్తమవుతోంది. దీనికి తోడు నకిలీ ఎరువులు కలకలం సృష్టిస్తుండడంతో వారికి కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఇటీవల కరీంనగర్‌, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో నకిలీ డీఏపీ విక్రయాలు వెలుగుచూడగా.. తాజాగా శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలో పట్టుబడ్డాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

వెలుగులోకి ఇలా..

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట గ్రామానికి గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తక్కువ ధరకు డీఏపీ ఎరువు ఇస్తామని తొలుత ఓ ఇద్దరు రైతులకు ఆశ చూపారు. వారి సహకారంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మొత్తంగా ఎనిమిది మంది రైతులకు 156 బస్తాలు విక్రయించి వెళ్లిపోయారు. ఒక్కో బస్తాకు ఒక్కొక్కరి వద్ద ఒక్కో రకంగా రూ.1,300 నుంచి రూ.1,500 తీసుకున్నారు. వారు వెళ్లిన కొన్ని గంటలకు ఈ సమాచరం వెలుగులోకి రాగా పలువురు రైతులు నకిలీవనే అనుమానంతో ఏఈఓకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం కలెక్టర్‌, ఎస్పీ జిల్లా వ్యవసాయాధికారి దృష్టికి రాగా.. వారు వెంటనే గ్రామానికి చేరుకుని విచారించారు. 116 బస్తాల డీఏపీతో పాటు రైతులు వినియోగించిన 39 ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు. వారి విచారణలో అవి నకిలీ ఎరువు బస్తాలని తేలినట్లు సమాచారం. దీంతో శాంపిళ్లను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించనున్నట్లు వెల్లడించారు.

ఉమ్మడి పాలమూరులోనకిలీ డీఏపీ కలకలం

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలో వెలుగులోకి..

మహదేవునిపేటలో 117 ఎరువుల బస్తాలు స్వాధీనం

రైతులు వినియోగించిన 39 ఖాళీ సంచులు సైతం..

కర్ణాటక నుంచి వచ్చి విక్రయించినట్లు అనుమానాలు

గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ విక్రయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement