‘సర్‌’ను సమర్థంగా పూర్తిచేస్తే నగదు పురస్కారం | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ను సమర్థంగా పూర్తిచేస్తే నగదు పురస్కారం

Jul 19 2026 2:02 AM | Updated on Jul 19 2026 2:02 AM

ఓటర్ల గుర్తింపులో బాధ్యతగా

వ్యవహరించాలి

బీఎల్వోలు, బీఎల్‌ఏల సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు

పాన్‌గల్‌/వీపనగండ్ల: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను నిర్దేశితా గడువులోగా అత్యంత సమర్థవంతంగా పూర్తిచేసిన బీఎల్వోలు, బీఏల్‌ఏలకు నగదు బహుమతులు అందజేస్తామని.. ప్రథమ బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.5 వేలు చెల్లించనున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం పాన్‌గల్‌, వీపనగండ్ల రైతువేధికల్లో బీఎల్వోలు, బీఎల్‌ఏలతో నిర్వహించిన సమీక్షలో మంత్రితో పాటు నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ సిద్ధేశ్వర్‌, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పాల్గొన్నారు. గ్రామాల వారీగా సర్‌ ప్రక్రియ పురోగతిని సమీక్షించి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు సజావుగా జరగాలని.. ఓటు చోరీ జరగొద్దని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తూ పశ్చిమబెంగాల్‌, బిహార్‌లో ఓట్ల చోరీ జరిగిందని.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ యావత్‌ దేశానికి తన తెలియపర్చారని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు పేరును ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు బీఎల్వోలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. నిరక్షరాస్యులు, వలస వెళ్లిన వారి వివరాలు సేకరించి వారి పేర్లను కూడా ఓటరు జాబితాలో ఉండేవిధంగా చూడాలని, అందుకు గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, బీఎల్వోలకు అవసరమయ్యే సహకారం అందివ్వాలని సూచించారు. మనిషికి ఓటు లేకపోతే మనగడకు అంతరాయం కలుగొచ్చని.. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సర్‌ ప్రక్రియ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ సిద్దేశ్వర్‌ సూచించారు. బీఎల్వోలు, బీఎల్‌ఏలు సమన్వయంగా పనిచేస్తూ ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి కోరారు. తక్కువ సమయం ఉన్నందున ప్రతి ఒక్కరూ త్వరితగతిన పూర్తి చేసేలా దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, సాయిచరణ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గోవర్ధన్‌సాగర్‌, వీపనగండ్ల తహసీల్దార్‌ ఎండీ ఖాజామైనుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement