ప్రాజెక్టులో మొదటి లిఫ్టు ఎల్లూరు పంపుహౌజ్‌లో మొదట 145 మెగావాట్ల సామర్థ్యం గల 9 పంపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. తర్వాత దాన్ని 8కి కుదించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు మోటార్లు బిగించగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 2 మోటార్లను బిగించింది. తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్ సామర్థ్యం కుదింపు, పాలమూరు ప్రాజెక్టు ద్వారా సాగునీటి ఎత్తిపోతలకు కేఆర్‌ఎంబీ అనుమతి ఇవ్వకపోవడం వంటి కారణాలతో మిగిలిన మోటార్ల ఏర్పాటు పెండింగ్‌లో పడింది. దీంతో ఇప్పటికే ఏర్పాటు చేసిన నాలుగు మోటార్లతోనే ప్రాజెక్టును రన్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.


