వెల్దండ: మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ సరిపడా తాగునీటిని సరఫరా చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం వెల్దండలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వానాకాలం మొదలైనప్పటికీ పలు గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహించడం సరైంది కాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చేపట్టాలని అన్నారు. యూరియా బుకింగ్ యాప్‌తో రైతులు అవస్థలు పడుతున్నారని.. ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి, శేఖర్ ముదిరాజ్, హన్మంత్, సాజ్యనాయక్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


