కల్తీపై కంట్రోల్‌ ఏదీ? | - | Sakshi
Sakshi News home page

కల్తీపై కంట్రోల్‌ ఏదీ?

Jul 7 2026 1:31 AM | Updated on Jul 7 2026 1:31 AM

అదనపు బాధ్యతలతో సతమతం

శాంపిల్స్‌ సేకరిస్తున్నాం..

తగ్గిన తనిఖీలు.. కుల్లుతున్న నాణ్యత

పాలమూరు: ఉమ్మడి జిల్లాలో కలుషిత ఆహారంతో అనారోగ్యాలకు గురవుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, పెళ్లి వేడుకల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఫుడ్‌ పాయిజన్‌తో అధికంగా చిన్నారులే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు కలుషితమైన ఆహారం తీసుకున్న రెండు గంటల్లో అస్వస్థతకు గురవుతారు. ప్రస్తుతం వర్షాకాలం కారణంగా చల్లబడిన వాతావరణం బ్యాక్టీరియా ఎదుగుదలకు అనుకూలంగా ఉండి.. వ్యాధులు విస్తరిస్తాయి. ఈ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్‌లు, పాఠశాలలు, వసతి గృహాల్లో వంటగదులు శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన ఆహార భద్రతా అధికారులు సరిపడా లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇదే అదునుగా హోటళ్లు, రెస్టారెంట్‌, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో నిల్వ చేసిన పదార్థాలకు మసాలాలు దట్టించి వినియోగదారులకు అంటగడుతున్నారు.

మ్మడి జిల్లాలో గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ నీలిమ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లను పర్యవేక్షిస్తారు. అయితే మహబూబ్‌నగర్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీలతకు నాగర్‌కర్నూల్‌ జిల్లా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ రెండు కూడా పెద్ద జిల్లాలు కావడంతో నమూనాల సేకరణ, తనిఖీలు చేయడం కష్టసాధ్యంగా మారింది. దీనికితోడు సీఎం పర్యటనలు, ఉన్నతాధికారులు, కలెక్టర్‌ సమావేశాలు అంటూ కొన్నిరోజులు గడిచిపోతున్నాయి. గద్వాల జిల్లాకు రెగ్యులర్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌ ఉండగా ఆయనకు అదనంగా వనపర్తి జిల్లా బాధ్యతలు అప్పగించారు. అలాగే నారాయణపేట రెగ్యులర్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌గా మౌనిక వ్యవహరిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆహార భద్రత అధికారులు సరిపడా లేకపోవడంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు.

ఇటీవల జరిగిన కలుషిత ఆహార ఘటనలో శాంపిల్స్‌ సేకరించాం. ఇందులో సోరకాయతో తయారు చేసిన స్వీట్‌ 5– 6 గంటలు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ తర్వాత స్వీట్‌లో లోపల ఫంగస్‌, బ్యాక్టీరియా వస్తుంది. దీనివల్ల తిన్నవారికి వాంతులు, విరేచనాలు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆహారం వండిన తర్వాత 6–8 గంటల వరకు తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ సమయం ఉంటే టాక్‌సిల్స్‌ ఏర్పడుతాయి. కలుషిత ఆహారంపై గత నెల 18న అంగన్‌వాడీలకు శిక్షణ ఇచ్చాం. ఇటీవల తనిఖీలు పెంచడంతోపాటు శాంపిల్స్‌ సేకరిస్తున్నాం. కలుషిత ఆహారంపై కూడా అవగాహన కార్యక్రమాలు పెంచుతాం.

– శ్రీలత,

ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, మహబూబ్‌నగర్‌

పాలమూరులో కలవరపెడుతున్న

కలుషిత ఆహార ఘటనలు

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు

అత్యధికంగా నిల్వ చేసిన పదార్థాలతోనే వినియోగదారులకు వడ్డింపు

ఉమ్మడి జిల్లాకు ముగ్గురే

ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లతో కనిపించని తనిఖీలు

మున్సిపాలిటీల్లో శానిటరీ విభాగాలదీ అదే తీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement