కార్పొరేట్‌ స్థాయిలో మోడల్‌ స్కూల్‌ | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ స్థాయిలో మోడల్‌ స్కూల్‌

Jul 3 2026 1:04 AM | Updated on Jul 3 2026 1:04 AM

వెల్దండ: కార్పొరేట్‌ స్థాయిలో వెల్దండ మోడల్‌ స్కూల్‌ను తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సోమిరెడ్డి అన్నారు. గురువారం యూత్‌ ఫర్‌ సేవాసంస్థ ప్రతినిధులతో కలిసి వెల్దండ మోడల్‌ స్కూల్‌లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే రూ. 30లక్షలతో పాఠశాలకు పెయింటింగ్‌ వేయించడంతో పాటు మరుగుదొడ్లు, తాగునీటి వసతి, తదితర అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందన్నారు. మరో రూ. 10లక్షలతో పాఠశాలను సుందరీకరణ చేస్తామన్నారు. విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యూత్‌ ఫర్‌ సేవాసంస్థ వారు పాఠశాలను దత్తత తీసుకొని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఆశిక, అరవింద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement