మళ్లీ వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే | - | Sakshi
Sakshi News home page

మళ్లీ వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

Jul 3 2026 12:58 AM | Updated on Jul 3 2026 12:58 AM

కల్వకుంట్ల కుటుంబం

రాష్ట్రాన్ని అప్పులపాలుజేసింది..

నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లురవి

కల్వకుర్తి రూరల్‌: రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం ఖాయ మని నాగర్‌కర్నూల్‌ ఎంపీ డా.మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. గురువారం కల్వకుర్తి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన ప్రజాపాలన – ప్రగతి నివేదిక, మహనీయుల జాతర ముగింపు సమావేశం నిర్వహించగా.. ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్ల కాలంలోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్నారు. ప్రధానంగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, రైతుభరోసా, సన్నరకం వరిధాన్యానికి రూ. 500 బోనస్‌తో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ట్రా న్ని అప్పులపాలుజేసి.. కల్వకుంట్ల కుటుంబం ఆస్తులను కూడబెట్టుకుందని ఆరోపించారు. ఎమ్మె ల్యే కసిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహాయ సహకారాలతో కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. తలకొండపల్లిలో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల, కల్వకుర్తిలో వంద పడకల ఆస్పత్రి, ఆమనగలులో 50 పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. కొట్ర నుంచి కల్వకుర్తి వరకు రూ. 45కోట్లతో నాలుగు వరుసల రహదారి పనులు సాగుతున్నాయన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజలు వెన్నుదన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీజీఎస్‌డీజీసీఎఫ్‌ఎల్‌ చైర్‌పర్సన్‌ సరిత, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, శాట్స్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బృంగి రత్నమాల, ఆనందకుమార్‌, పద్యానాయక్‌, విజయ్‌కుమార్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement