‘పీవీ’ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

‘పీవీ’ సేవలు చిరస్మరణీయం

Jun 29 2026 12:59 AM | Updated on Jun 29 2026 12:59 AM

కందనూలు: మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావు ఈ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం పీవీ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశం సాధించిన అభివృద్ధికి పీవీ నాడు చేసిన సంస్కరణలే ప్రధాన కారణం అని కొనియాడారు.

● కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని 11వ వార్డులో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేస్తామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తీగల సునేంద్ర కుమార్‌, వైస్‌ చైర్మన్‌ బాదం రమేష్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు జక్క రాజు, కౌన్సిలర్లు అవంచ మాధవిరాజు, మొహ్మద్‌ నిజాముద్దీన్‌, పడిగె శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement