కొల్లాపూర్: పర్యాటక ప్రాంతమైన అమరగిరి అభివృద్ధిపై పాలకులు సవతి తల్లి ప్రేమ చూపడం తగదని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఫయాజ్ ఆరోపించారు. అమరగిరికి వెళ్లే రహదారి నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం కొల్లాపూర్ ఎన్టీఆర్ చౌరస్తాలో సీపీఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమశిల టూరిజం సర్క్యూట్‌లో అమరగిరి గ్రామం కూడా ఉందన్నారు. కానీ ఆ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినడంతో పర్యాటకులతో పాటు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాలకులకు ఎన్నిసార్లు సమస్యను వివరించినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అమరగిరికి వెళ్లే రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ఆర్డీఓ భన్సీలాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఇందిర, తుమ్మల శివుడు, యూసూఫ్, మల్లేష్, నారాయణ, శివకృష్ణ, చందు, చాపల శేఖర్, కృష్ణయ్య, మద్దిలేటి, కృష్ణయ్య పాల్గొన్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ఏఎండీగా అజిత్‌రెడ్డి
కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ముత్తిరెడ్డిపల్లికి చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్‌కు చెందిన బి.అజిత్‌రెడ్డికి మరో కీలకపదవి దక్కింది. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా సీఎం రేవంత్‌రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన ఆయనకు తాజా బదిలీల్లో ఇన్వెస్ తెలంగాణ సీఈఒ బాధ్యతలు ఇవ్వగా, శనివారం ప్రభుత్వం మరో జీఓ 920ని విడుదల చేస్తూ.. కీలకమైన హైదరాబాద్ మెట్రోరైల్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా(ఎఫ్‌ఏసీ)గా నియమించింది. ఐఐటీ మద్రాస్ నుంచి డిగ్రీ పట్టా పొందిన అజిత్‌రెడ్డి 2012 సివిల్ సర్వీస్‌కు ఎంపికై రక్షణ శాఖలో డెహ్రాడూన్, చైన్నె, ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బెంగళూరులలో పనిచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత నమ్ముకస్తుడిగా వ్యవహరిస్తున్న అజిత్‌రెడ్డికి కీలకమైన మెట్రో బాధ్యతలు అప్పగించటంపై ఉమ్మడి జిల్లాలో హర్షం వ్యక్తం అవుతోంది.
శనేశ్వరుడికి
తైలాభిషేకాలు
కందనూలు: బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ జేష్ట్యాదేవి సమేత శనేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. జ్యేష్ఠ మాసం శుక్ల పక్షం శనిత్రయోదశి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి.. వేదమంత్రోచ్ఛారణ నడుమ శనేశ్వరుడికి తిల, తైలాభిషేకాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాసీ్త్ర, చైర్మన్ వెల్దండ గోపాల్‌రావు, సర్పంచ్ టి.సుగుణమ్మ పాల్గొన్నారు.


