సంక్రాంతికి ఆర్టీసీ సన్నద్ధం
● రీజియన్ నుంచి అదనపు బస్సులు
● హైదరాబాద్ నుంచి
డిపోల వైపు 430 సర్వీసులు
● నేటినుంచి ప్రారంభం
కానున్న రాకపోకలు
స్టేషన్ మహబూబ్‌నగర్: పల్లె సంస్కృతి ప్రతిబింబించే సంక్రాంతి పండుగకు ఎక్కడున్న వారి స్వస్థలాలకు రావడం పరిపాటిగా మారింది. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, శ్రామికులు ఈ పండుగకు ఇళ్లకు వచ్చి మూడు రోజులు జరిగే పండుగ సంబరాలను ఆస్వాదిస్తారు. అయితే ఈ ఏడాది పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని 10 డిపోల నుంచి అదనపు బస్సులను నడపనున్నారు. శుక్రవారం నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి రీజియన్‌లోని పది డిపోలకు 430 బస్సులు నడపనున్నారు. పండుగ తిరుగు ప్రయాణంలో ఈ నెల 17 నుంచి 21 వరకు ఆయా డిపోల నుంచి హైదరాబాద్ వైపు 364 బస్సులను నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజలు సంక్రాంతి పండుగకు ఎక్కువ సంఖ్యలో వారి స్వస్థలాలకు వచ్చే అవకాశం ఉండడంతో హైదరాబాద్‌కు అదనపు సర్వీసులు నడపడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అన్ని డిపోలకు హైదరాబాద్ రూట్లో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో ఈ రూట్లోనే ఎక్కువగా అదనపు బస్సులు నడపనున్నారు.
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలు, బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా, అదనపు వలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా తాగునీటి వసతి, కూర్చోవడానికి కుర్చీలు, బస్సుల వివరాలు, సూచనలను ఎప్పటికప్పుడూ ప్రయాణికులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రయాణికులకు సౌకర్యాలు
సద్వినియోగం చేసుకోండి
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని డిపోల నుంచి అదనపు బస్సులు నడపనున్నాం. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సురక్షితమైన ప్రయాణానికి ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలి. సంతోష్‌కుమార్, ఆర్టీసీ ఆర్‌ఎం
సంక్రాంతికి ఆర్టీసీ సన్నద్ధం
సంక్రాంతికి ఆర్టీసీ సన్నద్ధం


