రెండేళ్లలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, గడిచిన రెండేళ్లలో దాదాపు రూ.వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టానని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తానని చెప్పారు. ఇందులో భాగంగానే ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు త్వరలో మంజూరు అవుతాయని, ఇప్పటికే తెలకపల్లికి డిగ్రీ కళాశాల మంజూరైందని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ నుంచి తరలిపోయిన బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు తమ ఫౌండేషన్ ద్వారా బూట్లు అందిస్తామన్నారు. వట్టెం పంపు హౌజ్‌కు కరెంటు మంజూరు చేయించామని, మార్కండేయ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకుల ఇంటి పోరుతో కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తున్నారన్నారు. తనకంటే ముందు రేవంత్‌రెడ్డి సీఎం కావడాన్ని కేటీఆర్ జీర్ణించుకోపోతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ముందు ఇంటి పంచాయితీ తేల్చుకోవాలని, ఇంటి ఆడపడుచు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. బల్లగుద్ది చెబుతున్నా రాష్ట్రంలో, నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీదే గెలుపు అన్నారు. అనంతరం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పార్టీ తరపున ఎన్నికై న సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ చైర్మన్ రమణారావు, ఆర్టీఓ మెంబర్ గోపాల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు శ్రీను, నిజాం తదితరులు పాల్గొన్నారు.


