ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని వాహనదారులు ప్రతిఒక్కరు రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రోడు భద్రతపై విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డుపై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నియమాలను సిగ్నల్ వద్ద సూచనలు పాటించాలని, జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు దాటాలని సూచించారు. రోడ్డు నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు.
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి ఐదు నెలల పాటు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
మహిళలను వేధిస్తే
కఠిన చర్యలు : ఏఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో షీటీం, సైబర్ క్రైంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలు భయం లేకుండా స్వేచ్ఛగా జీవించేందుకు సురక్షిత వాతావరణం కల్పించడమే షీటీం లక్ష్యం అన్నారు. మహిళలు వేధింపులకు గురైతే డయల్ 100, సెల్ నం.87126 57676కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ సీఐ శంకర్, ఎస్‌ఐలు వీణారెడ్డి, రమాదేవి, రజిత, ఏఎస్‌ఐ విజయలక్ష్మి పాల్గొన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి
కల్వకుర్తి రూరల్: ఉమ్మడి జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేసి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. శుక్రవారం కల్వకుర్తిలోని పార్టీ కార్యాలయ ఆవరణలో ఆయన మాట్లాడారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో రైతులు ఎంతో నష్టపోతున్నారని, దీనిపై రైతుల పక్షాన పోరాడుతామన్నారు. అనంతరం ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే పార్టీ వందేళ్ల ఉత్సవాల వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జి పరశురాములు మాట్లాడుతూ ఖమ్మం డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే సభకు పెద్దఎత్తున కార్యకర్తలు, సానుభూతిపరులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో దాసు, ప్రేమ్‌కుమార్, శివ, శ్రీను, రాజు, రవీందర్, వీరేశం, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.2,809
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,809, కనిష్టంగా రూ.1,729 ధరలు పలికాయి. అలాగే హంస రూ.1,871, కందులు గరిష్టంగా రూ.6,876, కనిష్టంగా రూ.5,056, వేరుశనగ గరిష్టంగా రూ.8,733, కనిష్టంగా రూ.6,903, ఉలువలు రూ.3,610, మొక్కజొ న్న గరిష్టంగా రూ.1,975, కనిష్టంగా రూ.1,777 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో కందులు రూ.5,720గా ఒకే ధర లభించింది.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి


