జిల్లాలో 1,229 టన్నుల యూరియా నిల్వలు
నాగర్‌కర్నూల్: జిల్లాలో ప్రస్తుతం 1,229 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాసింగిలో మొక్కజొన్న సాగు 1.2 లక్షల ఎకరాలు, వరి 1.8 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉన్నందున రైతులకు సరిపడా యూరియా కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 17,514 టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశామన్నారు. రైతులు యూరియా గురించి ఆందోళన చెందకుండా సరిపడా యూరియాను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. అధికారులు, డీలర్లు యూరియా పంపిణీపై జారీ చేసిన ఆదేశాలు పాటించాలని సూచించారు.
‘108’ అంబులెన్స్ తనిఖీ
మన్ననూర్: అమ్రాబాద్ మండల పరిధిలో రోగులకు అత్యవసర సేవలందిస్తున్న 108 అంబులెన్స్ వాహనాన్ని గురువారం జిల్లా మేనేజర్ షేక్ జాన్ వహీద్, శ్రీను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనం ద్వారా అత్యవసర రోగులకు అందుతున్న సేవల వివరాలను అంబులెన్స్ ఈఎంటీ మల్లేష్, పైలెట్ సైదులును అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ విషయంలో మందులు అందజేయడంతోపాటు సేవలందించడంలో ఎలాంటి ఫిర్యా దులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాల ని సూచించారు. వాహనం కండీషన్ పరిశీలించిన వారు అత్యవసర సమయాల్లో క్షతగాత్రు లు, రోగులు వాహనం సేవలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ఉండాలన్నారు.
క్యాన్సర్ నివారణకు
టీకా తప్పనిసరి
వెల్దండ: గర్భశాయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు తప్పనిసరిగా టీకాను వేయించుకోవాలని డీఎంహెచ్‌ఓ రవికుమార్ అన్నారు. గురువారం ఆయన వెల్దండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో గర్భశాయ ముఖ ద్వారంతో క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి చెందడంలో దేశం రెండోస్థానంలో ఉందన్నారు. 40 శాతం మహిళలు ఈ వ్యాధిబారినపడి మృతి చెందుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా 14–15 ఏళ్లలోపు వారికి నివారణ టీకా ఇవ్వడానికి చర్యలు చేపడుతుందన్నారు. జిల్లాలో నెలకొన్న సిబ్బంది కొరతను త్వరగా పరిష్కరిస్తామన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలను వెంటనే సొంత భవనాల్లోకి వెళ్లాలన్నారు. వెల్దండలోని పీహెచ్‌సీలో అసంపూర్తి పనులు ఉంటే పూర్తిచేసి వైద్య సేవలు కొనసాగించాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భీమానాయక్, డాక్టర్ సింధు, సిబ్బంది మనోజ్‌కుమార్, పద్మలత, లక్ష్మణ్, మురళీమనోహర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 1,229 టన్నుల యూరియా నిల్వలు


