‘ప్రజావాణి’కి 31 అర్జీలు
నాగర్‌కర్నూల్: వివిధ శాఖల పరిధిలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందజేస్తున్న వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో 31 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు గ్రీవెన్స్‌కు 10..
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 10 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుదారుల సమస్యలను చర్యల నిమిత్తం ఆయా పోలీస్‌స్టేషన్లకు పంపిస్తామని తెలిపారు.
హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు
నాగర్‌కర్నూల్: జిల్లాకేంద్రం శివారులోని ఎండబెట్ల వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామానికి వెళ్లే దారిలో కేసరి సముద్రం చెరువు అలుగు పారుతున్న సమయంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయేవి. దీంతో జిల్లాకేంద్రంతోపాటు ఎండబెట్ల గ్రామానికి చెందిన ప్రజలు చాలా సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించారు. బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తిచేసేలా కృషిచేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
హోంగార్డులందరూ ఇన్సూరెన్స్ తీసుకోవాలి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న హోంగార్డులందరూ ఇన్సూరెన్స్ కవరేజ్ పాలసీ తీసుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్నారు. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న పలువురికి సోమవారం ఎస్పీ కార్యాలయంలో బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న హోంగార్డులందరూ యాక్సిస్ బ్యాంకులో అకౌంట్ కలిగి ఉండి వాళ్లు ఇచ్చే ఇన్సూరెన్స్ పాలసీని వినియోగించుకోవాలన్నారు. ఏడాది కి ఒకసారి రూ.11 వేలు చెల్లిస్తే కుటుంబ సభ్యులతోపాటు ఇద్దరు పిల్లలకు పాలసీ వర్తిస్తుందని, అనుకోని సంఘటన ఎదురైతే రూ.33 లక్షల కవరేజీ వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ అనిల్‌కుమార్, హోంగార్డు ఇన్‌చార్జి ఆర్‌ఐ రాఘవరావు, ఆర్‌ఎస్‌ఐ గౌస్‌పాషా, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజావాణి’కి 31 అర్జీలు


