ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు
బిజినేపల్లి: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉచిత పుస్తకాల పంపిణీ వంటి అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ కమిషనర్ శ్రీకృష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని అడ్మిషన్ ప్రత్యేక కార్యక్రమం కింద 14 జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో విద్యతోపాటు విజ్ఞానం, భవిష్యత్‌లో ఇంజినీర్లు, డాక్టర్లుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కోచింగ్, జేఈఈ మెయిన్స్ వంటి వాటికి ఉచితంగా మెటీరియల్స్ పంపిణీ చేస్తుందని వివరించారు. ఆయా వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇకపై విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల నుంచి కళాశాలలకు నేరుగా అడ్మిషన్లు అందుతాయన్నారు. కార్యక్రమంలో పాలెం కళాశాల అధ్యాపకులు మదన్‌మోహన్‌రెడ్డి, మహ్మద్‌గౌస్, గోపి, వినోద్, పద్మజ, ప్రవీణ్, విష్ణు, జానయ్య తదితరులు పాల్గొన్నారు.


