ఓటరు జాబితాపై అభ్యంతరాలు చెప్పండి
నాగర్‌కర్నూల్: మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఓటరు ముసాయిదాలో అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 3 మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా అభ్యంతరాలపై మున్సిపాలిటీల వా ర్డుల వారీగా ఇది వరకే విడుదల చేశారన్నారు. ము సాయిదా ఓటరు జాబితాను జనవరి 1న నోటీసు బోర్డులపై వార్డుల వారీగా ప్రచురించామని, ఏవై నా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సకాలంలో సమర్పించాలని సూచించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుదిజాబితా 10న ప్రచురిస్తామ న్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సజావు గా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 24 వార్డులు, 48 పోలింగ్ కేంద్రాలు, కల్వకుర్తిలో 22 వార్డులు, 44 పోలింగ్ కేంద్రాలు, కొల్లాపూర్‌లో 19 వార్డులు, 38 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు నాగర్‌కర్నూల్‌లో 28 అభ్యంతరాలు, కల్వకుర్తిలో 2, కొల్లాపూర్‌లో 50 అభ్యంతరాలు వచ్చాయని వాటిని వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఫాం–7 లేకుంటే ఏ ఒక్క ఓటరు తొలగించడం జరగదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు గుర్తించిన డూప్లికేట్, డబుల్, చనిపోయిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన ఓటర్ల వివరాలను తమకు అందిస్తే పరిశీలించి ఫాం–7 ద్వారా తొలగిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, మున్సిపల్ కమిషనర్లు, ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


