పక్కనే శ్రీవారి సముద్రం..
సింగోటం లక్ష్మీనర్సింహస్వామి ఆలయ భూముల్లో కేఎల్‌ఐ కాల్వలు, సమీపంలో కేఎల్‌ఐ ప్రాజెక్టు పరిధిలోని శ్రీవారిసముద్రం రిజర్వాయర్ కూడా ఉంది. సాగుకు సరిపడా నీరు ఉన్నా భూములు బీడుగానే ఉంటున్నాయి. సమీప పొలాలన్నీ పచ్చగా కళకళలాడుతుంటే మాన్యం భూములు మాత్రం బీడువారి దర్శనమిస్తున్నాయి. మాన్యం భూమిలో కొంతమేర చెట్లు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆలయ భూమిలో లీజు ప్రాతిపదికన మామిడి మార్కెట్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరగగా.. అగ్రిమెంట్ విషయంలో స్పష్టత లేకపోవడంతో మార్కెట్ నిర్మాణం జరగలేదు. తర్వాత కాలంలో మళ్లీ ఈ భూమి గురించి అధికారులు కానీ, ఆలయ కమిటీ కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆలయ భూములు ఆక్రమించవద్దని ఒకచోట బోర్డు పెట్టి చేతులు దులిపేసుకున్నారు.
ఆలయ అధికారులు ఏర్పాటు చేసినహెచ్చరిక బోర్డు


