వ్యూహరచన..!
● ప్రధాన పార్టీల సన్నాహకాలు షురూ
● అభ్యర్థుల జల్లెడకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్
● ఆశావహుల నుంచి
వ్యక్తిగత సమాచార
సేకరణ
● బీఆర్‌ఎస్,
బీజేపీ సైతం రంగంలోకి..
● ఎత్తులకు
పైఎత్తులతోముందుకు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పుర’ పోరుపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. కార్పొరేషన్/మున్సిపల్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడినప్పటికీ సం‘గ్రామంశ్రీలో బీఆర్‌ఎస్ అనూహ్యంగా పుంజుకోవడం.. శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపింది. గతంతో పోల్చితే మెరుగైన పంచాయతీ స్థానాలను సాధించడంతో బీజేపీలోనూ జోష్ నెలకొంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలు పోటాపోటీగా పోరు సన్నాహాలకు శ్రీకారం చుట్టాయి. పుర పాలికల ఎన్నికల్లో పాగా వేసేలా వ్యూహాలు పన్నుతున్నాయి.
‘పుర’ పోరుపై ముమ్మర కసరత్తు


