సదరం శిబిరాల నిర్వహణకు స్థల పరిశీలన
కందనూలు: దివ్యాంగులకు ప్రతినెలా నిర్వహించే సదరం శిబిరాల నిర్వహణ కోసం జిల్లాకేంద్రంలో కార్యాలయ భవన స్థలాలను సోమవారం అదనపు కలెక్టర్ దేవసహాయం, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఓబులేష్, పంచాయతీరాజ్ ఈఈ విజయ్‌కుమార్ పరిశీలించారు. ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో ప్రస్తుతం నిర్వహిస్తున్న భవన గదులు, ఇతర ఖాళీ స్థలం, ఫర్నిచర్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఖాళీ స్థలం గదులను పరిశీలించి వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీటిపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని, ఉన్నతాధికారుల సూచన మేరకు ఒక భవనాన్ని ఎంపిక చేస్తామని వారు పేర్కొన్నారు. సదరం శిబిరాల నిర్వహణలో ఇబ్బందులను తొలగించేందుకు వీటిని పరిశీలించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి కార్యాలయ ఉపసంచాలకులు వసంత్‌కుమార్, కార్యాలయ సూపరింటెండెంట్ మీర్ గాలిబ్ అలీ, డీఆర్‌డీఓ కార్యాలయ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.


