616 ఫిర్యాదులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పురపాలికల పరిధిలో ఓటర్ల ముసాయిదా జాబితాపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు.. మిగిలిన 18 మున్సిపాలిటీలో మొత్తం 316 వార్డులు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటివరకు మొత్తంగా 616 అభ్యంతరాలు వచ్చాయి. అదేవిధంగా సోమవారం ఆయా పురిపాలికల పరిధిలో అధికారులు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పలు అభ్యంతరాలు చెబుతూ.. పరిష్కరించాలని విన్నవించారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 60 డివిజన్ల పరిధిలో 144 ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపాలిటీల విషయానికి వస్తే.. దేవరకద్రలో 9, నాగర్‌కర్నూల్‌లో 121, కొల్లాపూర్‌లో 8, కల్వకుర్తిలో 36, నారాయణపేటలో 4, మక్తల్ 10, కోస్గిలో 5, మద్దూరులో 16, గద్వాలో 17, అయిజలో 22, వడ్డేపల్లిలో 36, వనపర్తిలో 8, కొత్తకోటలో 6చ అమరచింత 4, ఆమ్మకూర్‌లో 11, పెబ్బేరులో 71 ఫిర్యాదులు రాగా.. అలంపూర్ మన్సిపాలిటీలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు.
కానిస్టేబుళ్లకు
ప్రశంసాపత్రాలు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా పరిధిలో సైబర్ క్రైంలో ఉత్తమ ప్రతిభకనబరిచిన కానిస్టేబుళ్లు లక్ష్మీపతి, హన్మంతులకు డీజీపీ శివధర్‌రెడ్డి ప్రశంసాపత్రాలు, నగదు రివార్డు అందజేశారని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న గంటల లక్ష్మీపతి, నాగర్‌కర్నూల్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హన్మంతు సైబర్ క్రైం కేసులో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నారని చెప్పారు.


