
బీఆర్‌ఎస్ శ్రేణులకు అండగా ఉంటాం
అచ్చంపేట: పార్టీలోకి వ్యక్తులు వస్తుంటారు.. పో తుంటారు.. పార్టీనే శాశ్వతమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎస్‌కు రాజీనా మా చేసిన నేపథ్యంలో గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆయన నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులతో సమావేశమై మాట్లాడారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. శుక్రవారం అచ్చంపేటలో పార్టీ కార్యకర్తల సమావేశం ఉంటుందని, నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త హాజరుకావాలని కోరారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజ రవుతారని తెలిపారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు శాశ్వత ఇన్‌చార్జిని ప్రకటించే వరకు తాను అచ్చంపేట నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని.. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కై వసం చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు పోకల మనోహర్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహాగౌడ్, కౌన్సిలర్లు రమేశ్‌రావు, అంతటి శివ, పీఏసీఎస్ చైర్మన్లు నర్స య్యయాదవ్, భూపాల్‌రావు, కట్టా గోపాల్‌రెడ్డి, కరుణాకర్‌రావు, కేటీ తిరుపతయ్య ఉన్నారు.