
జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలి
నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.5వేల కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్‌నర్సింహ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక లక్ష్మణాచారి భవనంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా రైతాంగానికి సాగునీటి వసతి కల్పించేందుకు ఎంజీకేఎల్‌ఐ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. తెలంగాణ వచ్చాక జిల్లాగా ఏర్పడిన నాగర్‌కర్నూల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా కల్వకుర్తిలో నిర్వహించిన జిల్లా మహాసభలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు కేశవులుగౌడ్, హెచ్.ఆనంద్‌జీ, బండి లక్ష్మీపతి, గోపిచారి, కొట్ర శేఖర్, మారెడు శివశంకర్ ఉన్నారు.