
శనేశ్వరుడికి తైలాభిషేకాలు
బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శనేశ్వరాలయాన్ని సందర్శించి తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం స్వామివారికి తిల తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ గోపాల్‌రావు, ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి, కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, పుల్లయ్య, వీరశేఖర్, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం
బిజినేపల్లి: శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం భక్తులు సామూహికంగా సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కురవి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ మాజీ ధర్మకర్త గాడి సురేందర్, అర్చకులు జయంత్, చక్రపాణి, సిబ్బంది పురుషోత్తం, బాబయ్య పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కందనూలు/అచ్చంపేట రూరల్: జిల్లా కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో మరమ్మతు పనుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరా యం ఉంటుందని ఏడీఈ శ్రీనివాసులు శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు. హౌసింగ్‌బోర్డు, బీసీ కాలనీ, ఈశ్వర్‌కాలనీ, రాఘవేంద్రకాలనీ, మున్నూర్‌కాపు ఫంక్షన్‌హాల్, కొల్లాపూర్ క్రాస్‌రోడ్, శ్రీపురం రోడ్డు ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
● కల్వకుర్తి నుంచి అచ్చంపేటకు 132/33 కేవీ సబ్‌స్టేషన్‌కు రెండవ లైన్ ఏర్పాటు చేస్తున్నందున అచ్చంపేటతో పాటు ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర, లింగాల, బల్మూర్ మండలాలకు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ శ్రీధర్‌శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.

శనేశ్వరుడికి తైలాభిషేకాలు