
నేడు మెగా సర్జికల్ క్యాంపు
అచ్చంపేట రూరల్: పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రిలో ఆదివారం మూడవ మెగా సర్జికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ చెప్పారు. శనివారం ఆస్పత్రిలో సర్జికల్ క్యాంపు ఏర్పాట్లపై వైద్యులు, సిబ్బందితో సమీక్షించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సర్జికల్ క్యాంపులో ఉచితంగా 12 రకాల శస్త్రచికిత్సలు చేస్తామని.. నియోజకవర్గంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తారాసింగ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు ఉన్నారు.