
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ డీఈ
అలంపూర్: కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇరిగేషన్ డీఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని రక్షణ గోడ మరమ్మతు, ఇతర పనులను కాంట్రాక్టర్‌కు రూ.4 లక్షలకు అప్పగించారు. అయితే రెండురోజుల క్రితం కాంట్రాక్టర్ పనులకు సంబంధించిన ఎంబీ బుక్ మెజర్మైంట్ చేయడానికి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్‌నాయుడును కలిశారు. ఈ క్రమంలో డీఈ రూ.12 వేలు లంచం అడగగా.. పనుల్లో నష్టం వచ్చిందని అన్ని డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో రూ.11 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారి సూచన మేరకు గురువారం కాంట్రాక్టర్ ఇరిగేషన్ కార్యాలయంలో డీఈకి డబ్బులు ఇస్తుండగా.. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామన్నారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నం.1064, వాట్సప్ నం.94404 46106కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు.
రూ.11 వేలు తీసుకుంటూ
పట్టుబడిన అధికారి