
జిల్లావ్యాప్తంగా జోరువాన
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. అత్యధికంగా తెలకపల్లి మండలంలో 53.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా ఉప్పునుంతల మండలంలో 4.5 మి.మీ. వర్షం కురిసింది. జిల్లాలో ఇప్పటికే రైతులు పత్తి తదితర పంటలను సాగుచేయగా.. వారం రోజులుగా సరిపడా వర్షం లేకపోవడంతో ఆందోళన చెందారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షం కురవడంతో పంటలకు ఉపశమనం కలిగినట్టయ్యింది. నాగర్‌కర్నూల్ మండలంలో 51.5 మి.మీ., పదరలో 49, బల్మూరులో 47.8, అమ్రాబాద్‌లో 40.5, అచ్చంపేటలో 35, బిజినేపల్లిలో 31.8, వెల్దండలో 31.3, చారకొండలో 23.5, వంగూరులో 22.3, కల్వకుర్తిలో 21.3, తాడూరులో 20, తిమ్మాజిపేటలో 18.5, లింగాలలో 9.8, ఊర్కొండలో 6 మి.మీ. వర్షపాతం నమోదైంది.
● ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మరో రెండు రోజులపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.
తెలకపల్లి మండలంలో అత్యధికంగా 53.5 మి.మీ. వర్షపాతం నమోదు