పెద్దకొత్తపల్లి: జిల్లాలోని 13 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా విద్యా బోధన చేపట్టబోతున్నట్లు డీఈఓ రమేష్‌కుమార్ తెలిపారు. ఏఐ ద్వారా విద్యా బోధన కోసం మండలంలోని చంద్రకల్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్లను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఐ ద్వారా విద్యార్థులకు గణితం, తెలుగు పాఠాలు బోధించనున్నట్లు వివరించారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా కంప్యూటర్లను ప్రారంభిస్తామని చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు కింద మండలంలోని చంద్రకల్‌తోపాటు గంట్రావుపల్లి ప్రాథమిక పాఠశాలల్లో ఈ ప్రోగ్రాం అమలు చేస్తున్నామన్నారు. డీఈఓ వెంట జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి షర్ఫుద్దీన్, ఎంఈఓ శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు.
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
ఉప్పునుంతల: మండలంలోని మామిళ్లపల్లిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. ఉదయం స్వామివారికి హోమం, బలిహరణం, ఆర్జిత సేవలతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊరేగింపు సేవ, మోహినిసేవ, గరుడవాహన సేవలు, ఎదుర్కోళ్లు కార్యక్రమం చేపట్టారు. అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణ తంతును జరిపించారు. స్వామివారి కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహరావు, ఈఓ నర్సింహులు, నాయకులు అనంతరెడ్డి, తిప్పర్తి నర్సింహ్మారెడ్డి, రఘుపతిరెడ్డి, అనంతప్రతాప్‌రెడ్డి, గంగుల నర్సింహ్మారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, ఆలయ పాలకవర్గం కమిటీ సభ్యులు గణేష్‌గౌడ్, స్వరూప, కృష్ణయ్య, ప్రదీప్‌ప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్ పరిసర గ్రామా ల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
నేడు రాత్రి రథోత్సవం..
మామిళ్లపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి రథోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహరావు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
ఏఐ ద్వారా విద్యా బోధన


