కందనూలు: ఈ నెల 21 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనాల్లో జిల్లాలోని ఆయా పరీక్ష కేంద్రాల పరిధిలోని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. సోమవారం ఉదయం సెట్–2 పదో తరగతి ప్రశ్నపత్రాల బండిళ్లు డీఈఓ రమేషకుమార్ పర్యవేక్షణలో విద్యా శాఖ అధికారులు ప్రత్యేక వాహనాల్లో జిల్లాలోని 59 పరీక్ష కేంద్రాల పరిధిలో ఉన్న 18 పోలీస్‌స్టేషన్లకు 6 రూట్లలో అత్యంత పకడ్బందీగా తరలించడం జరిగింది. ఈ నెల 12న సెట్–1 ప్రశ్నపత్రాలు జిల్లాకేంద్రానికి రానున్నాయని డీఈఓ చెప్పారు. ప్రశ్నపత్రాల తరలింపులో జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్‌రావు, ఎంఈఓలు శంకర్‌నాయక్, బాలకిషన్, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రఘునందన్‌శర్మ, శ్రీనివాస్‌రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు జాతీయ కమిషన్ సభ్యుడి రాక
నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రానికి జాతీయ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ మంగళవారం వస్తున్నారని కలెక్టరేట్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు.


