కాజీపేటకే ఎందుకీ కోత?.. జంక్షన్‌కు ప్రాధాన్యమేదీ..! | - | Sakshi
Sakshi News home page

కాజీపేటకే ఎందుకీ కోత?.. జంక్షన్‌కు ప్రాధాన్యమేదీ..!

Nov 15 2026 1:20 PM | Updated on Nov 15 2026 1:20 PM

శబరిమలై యాత్రికుల సౌకర్యార్థం ఈ నెల నుంచి డిసెంబర్‌ వరకు, వచ్చే ఏడాది మకరజ్యోతి వరకు వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. కొట్టాయం, చెంగనూరు మీదుగా కొల్లాం జంక్షన్‌ వరకు ఈ రైళ్లను నడపనున్నారు. హైదరాబాద్‌, చర్లపల్లి నుంచి నల్లగొండ మార్గంలో ఎగువ, దిగువ దిశల్లో కలిపి 48 ట్రిప్పులు కేటాయించారు. అదే సమయంలో కాజీపేట–ఖమ్మం మార్గంలో ఇరు దిశల్లో కలిపి ఆరు ట్రిప్పులే ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన కాజీపేట జంక్షన్‌ మీదుగా ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాలకు నిత్యం అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వరంగల్‌ నగరంతోపాటు ఉమ్మడి జిల్లాల ప్రయాణికులకు ఇది ప్రధాన రైల్వే కేంద్రం. అలాంటి కాజీపేట మీదుగా శబరిమల యాత్రకు తగినన్ని ప్రత్యేక రైళ్లు లేకపోవడం భక్తులకు ఇబ్బందిగా మారింది.

పెరుగుతున్న భక్తులకు

అనుగుణంగా రైళ్లు పెంచాలి

వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఏటా పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలై యాత్రకు వెళ్తుంటారు. ప్రత్యేక రైళ్ల కేటాయింపులో కాజీపేటకు తగిన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. కనీసం వారాంతాల్లోనైనా అదనపు సర్వీసులు నడిపితే రిజర్వేషన్‌ కష్టాలు కొంతవరకు తగ్గుతాయి.

– రఘు గోకారపు (గురుస్వామి),

కుమార్‌పల్లి, హనుమకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement