శంకర్ 2000 సంవత్సరంలో ఏడవ తరగతి చదువుతున్న సమయంలో కబడ్డీ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఆటలో భాగంగా కళ్లకు బలమైన గాయం కావడంతో రెండు కళ్లు చూపు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రులు తిప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. కళ్లు పోయినా కలలు చెదరలేదని నిరూపిస్తూ శ్రవణ పద్ధతిలో చదువు కొనసాగించి డిగ్రీ పూర్తి చేశాడు.
జిల్లాలో పగటి ఉష్ణొగ్రతలు మోస్తరుగా నమోదు అవుతున్నా..
రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది.
పాటతో వెలుగులు
కబడ్డీలో చూపు కోల్పోయిన శంకర్
● డిగ్రి పూర్తిచేసి ఉద్యమ పాటలతో ప్రజల్లో చైతన్యం
● సామాజిక రుగ్మతలపై గళమెత్తి
సాంస్కృతిక సారథిగా గుర్తింపు
● చీకట్ల ఆడియో ద్వారా సొంతూరిపై ప్రత్యేక గీతాలు
మహాముత్తారం: విధి కంటిచూపు లాగేసుకున్నా ఆత్మ విశ్వాసంతో అడుగులు వేసి గళాన్నే ఆయుధంగా మలుచుకొని జీవితంలో నిలబడ్డాడు ఓ అంధుడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలకేంద్రానికి చెందిన చీకట్ల శంకర్‌కు కబడ్డీలో తగిలిన గాయం జీవితాంతం చీకట్లను మిగిల్చినా చదువుపై మక్కువ వీడక పాటలతో సమాజాన్ని మేల్కొలు పు తూ నేడు ఎందరికో ఆద ర్శంగానిలుస్తున్నాడు.
ఉద్యమ గళం..
సామాజిక చైతన్యం
చిన్నతనంనుంచే ఆలోచనలకు అక్షర రూపమిచ్చే శంకర్ సమకాలిన రాజకీయ, సామాజిక అంశాలపై పాటలు అల్లడం ప్రారంభించాడు. గతంలో మాజీ సీఎంలు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడుతో పాటు కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీపై పలు అంశాలపై పాటలు రాసి పాడారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రతిబింబించేలా ఉద్యమ గీతాలను రచించి తనదైన శైలిలో పాడుతూ ప్రజల్లో చైతన్యం రగిలించారు. ఉద్యమ పాటలకే పరిమితం కాకుండా సమాజంలో దురాచారాలపై శంకర్ తన గళాన్ని విప్పాడు. డ్రక్స్ వాడకంతో కలిగే అనార్థాలు. మద్యపాన నిషేధం, గుడుంబా నివారణ వంటి ప్రాధాన్యతను వివరిస్తూ పాటలు పాడారు. సమాజ హితమే ధ్యేయంగా పనిచేస్తూ సాంస్కృతిక సారథిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రతిభకు తగిన గుర్తింపు..
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం కళాకారులను ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ సాంస్కృతి సారథిలో శంకర్ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కింది. ఆ విభాగంలో కళాకారుడిగా నియమితులైన ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు సామాజిక అంశాలపై ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. ప్రస్తుతం నెలకు రూ.31వేల వేతనంతో గౌరవ ప్రదంగా జీవిస్తున్నాడు. శారీరక లోపాన్ని అధిగమించి తమ గళంతో సమాజ హితాన్ని కోరుకుంటున్న శంకర్ ప్రయాణం నేటి తరానికి నిలువెత్తు స్ఫూర్తి.
సొంతూరిపై చీకట్ల ఆడియో పాటలు
తన పుట్టిన ఊరుపై మమకారంతో మాఊరు చూడండోయ్ మహాముత్తారం అంటూ ఆయన రాసి పాడిన పాట విశేష ఆదరణ పొందింది. చీకట్ల ఆడియో పేరిట జిల్లాలోని ప్రముఖ పర్యాటక చారిత్రక కేంద్రాల విశిష్టతను వివరిస్తూ పలు పాటలను స్వయంగా రచించి ఆలపించారు. అంధత్వాన్ని జయించి తన పాటలతో సమాజానికి వెలుగులు పంచుతున్న శంకర్ ప్రతీ ఒక్కరికీ స్పూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు.
జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు (డిగ్రీలు సెల్సియస్‌లలో..)
కబడ్డీలో రెండు కళ్లు
కోల్పోయినా..


