గ్రంథాలయాల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాల అభివృద్ధికి కృషి

Nov 15 2026 1:20 PM | Updated on Nov 15 2026 1:20 PM

ములుగు: గ్రంథాలయాల అభివృద్ధికి మంత్రి సీతక్క సహకారంతో నిరంతరం కృషి చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆయన శనివారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో నూతన భవనాలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మధ్యాహ్న భోజనం, సాయంత్రం టీని సొంత ఖర్చులతో అందిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఆసియా రియాజ్‌ మీర్జా, కౌన్సిలర్‌ ఎండీ కుత్బుద్దీన్‌, జక్కుల రేవంత్‌ యాదవ్‌, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.

వ్యాధిగ్రస్తులను గుర్తించాలి

ఏటూరునాగారం: ఇంటింటికీ ఆశ కార్యకర్తలు తిరుగుతూ వ్యాధిగ్రస్తులను గుర్తించాలని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌ సూచించారు. మండల కేంద్రంలోని ఆకులవారిఘణపురం 3వ సబ్‌సెంటర్‌లో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా సబ్‌ సెంటర్‌లోని రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ వారికి కేటాయించిన సెక్టార్‌లో పర్యటించి వ్యాధిగ్రస్తులను గుర్తించి పరీక్షలు చేయాలన్నారు. వృద్ధులు, టీబీ, బీపీ, షుగర్‌ వంటి పరీక్షలు చేసి వారి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రొయ్యూర్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి మంకిడి వెంకటేశ్వర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

పెంచిన పన్నులు

తగ్గించాలి

ములుగు రూరల్‌: మున్సిపాలిటీ పరిధిలో పెంచిన ఇంటి, వ్యాపార సముదాయాల పన్నులను తగ్గించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తూటుపల్లి రవికుమార్‌ అన్నారు. ఈ మేరకు శనివారం పార్టీ అర్బన్‌ అధ్యక్షుడు ఇమ్మడి రాకేశ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వ్యాపారులకు కరపత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. పెంచిన పన్నులు తగ్గించాలని రేపటి నుంచి చేపట్టిన 48 గంటల దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాభిప్రాయం లేకుండా ఏకపక్షంగా కౌన్సిల్‌ తీర్మానం చేసి పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బలరాం, భాస్కర్‌రెడ్డి, భూక్య జవహర్‌లాల్‌, నగరపు రమేశ్‌, రవీంద్రాచారి, కృష్ణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

భద్రకాళి దేవాలయాన్ని

సందర్శించిన ప్రముఖులు

హన్మకొండ కల్చరల్‌: శ్రీభద్రకాళి దేవాలయాన్ని శనివారం పద్మశ్రీ అవార్డు గ్రహిత, అంతర్జాతీయ ఈఎన్‌టీ వైద్యులు డాక్టర్‌ మోహన్‌ కామేశ్వరన్‌తోపాటు పలువురు ప్రముఖులు సందర్శించి అమ్మవారికి ప్రత్యేకపూజలు జరుపుకున్నారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. డాక్టర్‌ మోహన్‌ కామేశ్వరన్‌ వెంట ఈఎన్‌టీ సర్జన్‌ డాక్టర్‌ ద్వారకానాథ్‌, డాక్టర్‌ పి. సాంబశివరావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement