వ్యవసాయ కూలీ నుంచి పోలీస్‌ ఉన్నతాధికారిగా.. | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ కూలీ నుంచి పోలీస్‌ ఉన్నతాధికారిగా..

Nov 15 2026 1:20 PM | Updated on Nov 15 2026 1:20 PM

వ్యవసాయ కూలీ నుంచి పోలీస్‌ ఉన్నతాధికారిగా..

యువతకు రోల్‌మోడల్‌గా ఇంటెలిజెన్స్‌ ఎస్పీ రమేశ్‌

ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ పతకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా అందుకుంటున్న ఇంటెలిజెన్స్‌ ఎస్పీ రమేష్‌ (ఫైల్‌)

ములుగు: పట్టుదల ఉంటే పేదరికం ప్రగతికి అడ్డుకాదని నిరూపించారు మలుగు జిల్లావాసి, తెలంగాణ ఇంటెలిజెన్స్‌ విభాగం ఎస్పీ డి.రమేష్‌. విధి నిర్వహణలో చూపిన అంకితభావం, వృత్తి నైపుణ్యం, దేశ భద్రతకు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ అందుకున్న ఆయనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట సేవా పతకం–2026 ప్రకటించింది.

వ్యవసాయ కూలీ నుంచి ఇంటెలిజెన్స్‌ ఎస్పీ వరకు..

జిల్లాలోని వెంకటాపురం (ఎం) మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దండుగుడు గౌరి లక్ష్మీ, మల్లయ్యలకు కుమారుడు రమేష్‌ వ్యవసాయ కూలీగా జీవితం ప్రారంభించారు. ప్రైవేట్‌ టీచర్‌గా, ఆర్‌ఎంపీ వైద్యుడిగా, ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా, న్యూస్‌ రిపోర్టర్‌గా, లైబ్రరీ అసిస్టెంట్‌గా, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వివిధ వృత్తుల్లో పనిచేసినప్పటికి సంతృప్తి చెందలేదు. జీవితంలో ఏదైనా సాధించాలనే సంకల్పంతో 1995లో పోలీస్‌శాఖలో ఎస్సైగా కొలువుసాధించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఎస్పీ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

30 వేల మంది విద్యార్థులకు స్ఫూర్తి..

తెలంగాణలోని 100కు పైగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను సందర్శించి 30 వేల మందికి పైగా విద్యార్థుల్లో, హైదరాబాద్‌లో 1500 మంది యువతకు ఆత్మవిశ్వాసం, ఉన్నత లక్ష్యాల పట్ల వ్యక్తిత్వ వికాస తరగతులు బోధించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ‘పూర్ణానంద గోల్డ్‌ మెడల్‌’ను ఏర్పాటు చేశారు. 2022 నవంబర్‌లో అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో నిర్వహించిన ప్రపంచ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ సదస్సులో పాల్గొనడం ఆయన వృత్తి ప్రస్థానంలో మరో మైలురాయి.

విశిష్ట సేవలకు గుర్తింపుగా సీఎం రేవంత్‌రెడ్డి

ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ పతకం ప్రదానం

ఇటీవల అతి ఉత్కృష్ట సేవా పతకం ప్రకటించిన కేంద్రం

30 వేల మంది విద్యార్థులకు స్ఫూర్తి తరగతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement