నల్లబ్యాడ్జీలతో నిరసన | - | Sakshi
Sakshi News home page

నల్లబ్యాడ్జీలతో నిరసన

Nov 15 2026 1:20 PM | Updated on Nov 15 2026 1:20 PM

ములుగు రూరల్‌: భారత్‌ సమ్మిట్‌లో రాహుల్‌గాంధీ పాల్గొనటాన్ని నిరసిస్తూ శనివారం జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం మాట్లాడుతూ దేశ భద్రత, ప్రతిష్టకు సంబంధించిన విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష నాయకులు రాహుల్‌ గాంధీ అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. అలాంటి నాయకులు హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్‌ సమ్మిట్‌కు ఆహ్వానించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌ రెడ్డి, రవీంద్రచారి, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement