సాక్షిప్రతినిధి, వరంగల్‌ : | - | Sakshi
Sakshi News home page

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

Nov 15 2026 1:20 PM | Updated on Nov 15 2026 1:20 PM

అయ్యప్ప భక్తులకు శబరిమలై యాత్ర ఓ పవిత్రమైన సంకల్పం. స్వామి దర్శనం కోసం నెలల ముందే ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ రైల్వే రిజర్వేషన్లు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. దీనికి తోడు శబరిమలై యాత్ర కోసం దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) ఇటీవల ప్రకటించిన ప్రత్యేక రైళ్ల కేటాయింపులో కాజీపేట మార్గానికి అతి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ మార్గంలో 48 ట్రిప్పులు కేటాయించగా.. కాజీపేట–ఖమ్మం మార్గంలో కేవలం ఆరు ట్రిప్పులకే పరిమితం చేయడంపై అసంతప్తి వ్యక్తమవుతోంది.

రిగ్రెట్‌.. వెయిటింగ్‌ లిస్టులతో సతమతం

ఉమ్మడి వరంగల్‌ నుంచి అయ్యప్ప భక్తులు శబరిమలై వెళ్లేందుకు ప్రధానంగా కాజీపేట మీదుగా వెళ్లే రైళ్లపై ఆధారపడుతున్నారు. ఇప్పటికే కేరళ వైపు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తే రెండు నెలల ముందుగానే రిగ్రెట్‌ ఆప్షన్‌ కనిపిస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. మరికొన్ని రైళ్లలో భారీ వెయిటింగ్‌ లిస్టులు ఉండటంతో ప్రయాణం ఖరారవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కుటుంబాలతో వెళ్లేవారు, వృద్ధులు, చిన్నారులతో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

●

● రిజర్వేషన్లు దొరక్క ఇబ్బందులు

పడుతున్న అయ్యప్ప భక్తులు

● కాజీపేట మీదుగా మరిన్ని ప్రత్యేక

రైళ్లు నడపాలని డిమాండ్‌

శబరిమలై ప్రత్యేక రైళ్లలోనూ వరంగల్‌కు అన్యాయం!మాలధారుల రద్దీకి తగ్గట్లు లేని రైళ్ల కేటాయింపు

లిమిటెడ్‌ రైళ్ల వల్ల

టికెట్లు దొరకడం లేదు..

శబరిమలై సీజన్‌లో రైళ్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో టికెట్లు దొరకడం కష్టమవుతోంది. వెయిటింగ్‌ లిస్టులు పెరగడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులతో వెళ్లే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేలా అదనపు బోగీలు, తగిన ఏర్పాట్లు చేయాలి.

– సిరిమల్లె రజనీకాంత్‌,

నయీంనగర్‌, హనుమకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement