జిల్లా జనాభా 2,94,671
రెవెన్యూ మండలాలు 10
గ్రామ పంచాయతీలు 174
మున్సిపాలిటీలు 1
ఏటూరునాగారం: చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకోవడంతో పాటు.. ఇతర అంశాలపై సమాచారం కావాలన్నా గ్రామ పంచాయతీ పరిధిలోని వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక క్లిక్‌తో అరచేతిలో జీపీల వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించింది.
ఆన్‌లైన్‌లోనే అన్నీ..
రాష్ట్రంలో మూడు వేల పైచిలుకు గ్రామ పంచాయతీలకు ఈ ఏడాది నుంచే ఫైండ్ యువర్ జీపీ వెబ్‌సైట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. రెండు నెలల క్రితం ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించి.. గత నెల 21 నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (విలేజ్ డెవలప్‌మెంట్ ప్లాన్)లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పోర్టల్‌తో పాటు వెబ్‌సైట్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా, మండలం, గ్రామం పేరును ఎంచుకొని ఆయా పంచాయతీల వివరాలను చూసే విధంగా తీర్చిదిద్దారు.
ఫైండ్ యువర్ జీపీలో వివరాలు
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. గ్రామ పంచాయతీకి కేటాయించిన లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ(ఎల్‌జీడీ) కోడ్ నంబర్ నుంచి పలు అంశాలను పొందవచ్చు. గ్రామ ప్రస్తుత జనాభా, వైశాల్యం, గృహాలు, శివారు గ్రామాలు, వార్డు సంఖ్యను పొందుపర్చారు. గ్రామ ముఖ్య చరిత్రతో పాటు సర్పంచ్, వార్డు సభ్యుల పేర్లను నమోదు చేశారు. ప్రధాన కూడళ్లు, ఎస్‌హెచ్‌జీ మహిళా వివరాలు, రేషన్‌న్ కార్డులు, ఆధార్ కార్డులు, ఆలయాలు అన్ని రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాల వారీగా అభివృద్ధి వివరాలు, నిధుల అంచనాను పొందవచ్చు. గ్రామ పంచాయతీ భవనం, గదుల సంఖ్య, రహదారులు, వ్యవసాయ ఆధారిత వనరులు(చెరువులు, కుంటలు), మిషన్ భగీరథ కుళాయిలు, పైపులైన్, పార్కులు, చెత్త సేకరణ వాహనాలు, పాఠశాలల వివరాలను వీక్షించవచ్చు. మీ గ్రామ సమాచారాన్ని వీక్షించాలంటే ఫైండ్ యువర్ గ్రామ పంచాయతీ అంటూ కింద వివరాలను పొందుపర్చారు.
జిల్లాలోని జనాభా.. గ్రామాలు
అందుబాటులోకి
ఫైండ్ యువర్ జీపీ వెబ్‌సైట్
ఆన్‌లైన్‌లో 171 పంచాయతీల
వివరాలు
విలేజ్ డెవలప్‌మెంట్
ప్లాన్‌లో భాగంగా పోర్టల్
ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రాలు
మేడారం – సమ్మక్క–సారలమ్మ
రామప్ప – రామలింగేశ్వరస్వామి
హేమాచలక్షేత్రం – లక్ష్మీనర్సింహస్వామి
లక్నవరం సరస్సు రామప్ప సరస్సు
బొగత జలపాతం


