భక్తిశ్రద్ధలతో హేమాచలుడికి పూజలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో హేమాచలుడికి పూజలు

Sep 6 2026 1:31 AM | Updated on Sep 6 2026 1:31 AM

మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేట్‌ బస్సులు, ఆటోలు తదితర వాహనాల్లో తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. గంటల కొద్ది సమయం భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరాన్ని పోలి ఉండే స్వామివారిని దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. పూజారులు పవన్‌కుమార్‌, రాజీవ్‌ శర్మ, ఈశ్వర్‌చంద్‌ రామనుజం భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement