అవినీతికి కేరాఫ్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

అవినీతికి కేరాఫ్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వం

Sep 5 2026 5:43 AM | Updated on Sep 5 2026 5:43 AM

ఏటూరునాగారం: కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓడవాడ నుంచి వైజంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. వంటావార్పు, మహిళలతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బడే నాగజ్యోతి, నాయకులు పోరిక గోవింద్‌ నాయక్‌, కృష్ణ, జంపన్న, సునీల్‌ కుమార్‌, శ్రీలత, ఖాజా పాషా, సర్దార్‌ పాషా, ప్రదీప్‌ రావు, మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, విజయ నాగరాజు, పద్మ, స్వరూప, సరితశ్రీనివాస్‌, రామ్మూర్తి, రామయ్య, రవీందర్‌, రఘు, చంద్రబాబు పాల్గొన్నారు.

ఫ్లెక్సీలను చింపడం సరికాదు

వారం రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలను పోలీసులు చించివేశారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు ఆరోపించారు. శుక్రవారం పోలీసులు, లక్ష్మీనర్సింహరావు మధ్య వాగ్వాదం నెలకొంది.

బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు

లక్ష్మీనర్సింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement