కాళేశ్వరం దేవస్థానం నిర్మాణాల వేగిరం | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం దేవస్థానం నిర్మాణాల వేగిరం

Sep 5 2026 5:43 AM | Updated on Sep 5 2026 5:43 AM

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్ధరణలో భాగంగా విజయగణపతి ఆలయం నైరుతి మూలన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.198కోట్లతో ఆలయ నిర్మాణాలు చేపట్టారు. శుక్రవారం స్టోన్‌తో బేస్‌మెంట్‌ 12ఫీట్ల నుంచి నిర్మాణం చేపట్టారు. వెనుకాల ప్రాకారం నిర్మిస్తున్నారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఘనంగా అభిషేకం

రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి వారికి వైభవంగా అభిషేకం జరిపించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి ప్రతీ శుక్రవారం అభిషేకం నిర్వహిస్తున్నట్లు ఈఓ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్‌ సంపత్‌రావు, సర్పంచ్‌ మొగిళి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement