ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

Sep 5 2026 5:43 AM | Updated on Sep 5 2026 5:43 AM

టీఆర్‌ఎస్‌ఎంఏ

ఆధ్వర్యంలో ప్రదానం

ములుగు: డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి, ఉపాధ్యాయ దినో త్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(టీఆర్‌ఎస్‌ఎంఏ) జిల్లా ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదా నోత్సవం ఇంచర్లలోని బ్రాహ్మణి విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ఎంఏ జిల్లా అధ్యక్షుడు పోశాల వీరమల్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌ ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని 23 ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 46 మంది ఉపాధ్యాయులను పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ఎంఏ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సతీష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగరి శ్రీనివాసరావు, ట్రెజరర్‌ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement