ఏటూరునాగారం: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఽసీతక్క అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుస్తులు, జూట్ బ్యాగుల తయారీ యూనిట్‌ను గురువారం పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి మంత్రి ప్రారంభించారు. కుట్టుమిషన్ల ద్వారా ఆర్థికంగా ఆదాయం పొందాలన్నారు. రూ.10 లక్షలతో ఆధునిక మిషనరీలతో యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. గిరిజన మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. అనంతరం ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు. ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్డులో ఐటీడీఏ భవనానికి కేటాయించిన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. భవన నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఐటీడీఏ సమావేశపు గదిలో మండల పరిధిలో 1,219 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను మంత్రి అందజేశారు. అలాగే ఉమ్మడి జిల్లా పరిధిలో తొలిసారిగా ఎంపిక చేసిన 11 ఉత్తమ పాఠశాలలకు అవార్డులు, పది మందికి ల్యాప్‌టాప్‌లు మంత్రి అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కల్యాణి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ జనార్దన్, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, ఎస్‌డీసీ ప్రతాప్ పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
ములుగు: నిరుద్యోగ యువత పోలీస్ ఉద్యోగాలు సాధించేలా ప్రభుత్వం ఉచిత శిక్షణ అందిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ పొందనున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను సీతక్క గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రాథమిక శారీరక కొలతల పరీక్షలకు 300 మంది హాజరు కాగా 250 మంది శిక్షణకు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
తీజ్ ఉత్సవాల్లో మంత్రి నృత్యం..
ములుగు పట్టణంలో బంజారా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో మంత్రి సీతక్క స్థానిక మహిళలు, యువతులతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ బంజారా ఆలయానికి రూ. 50 లక్షలు కేటా యించినట్లు తెలిపారు. బంజారా సోదర, సోదరీ మణులకు మంత్రి తీజ్ శుభాకాంక్షలు తెలిపారు.


