ములుగు: వ్యాధి నిరోధక టీకాల వివరాలను యు–విన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆరోగ్య కార్యకర్తలకు యు–విన్ పోర్టల్‌పై గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు హాజరై మాట్లాడారు. టీకాల వివరాలను యు–విన్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. తద్వారా తదుపరి టీకా డ్యూ డేట్, టీకా కేంద్రం బుకింగ్‌తో పాటు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందవచ్చని వివరించారు. జాతీయ టీకాల షెడ్యూల్ ప్రకారం పుట్టినప్పటి నుంచి 17 సంవత్సరాల వరకు పిల్లలకు అన్ని టీకాలు వేయించాలని వెల్లడించారు. దీంతో వ్యాధుల నుంచి పిల్లలు రక్షణ పొందుతారని డీఎంహెచ్‌ఓ వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఫణీంద్ర, నాగ అన్వేష్, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ
గోపాల్‌రావు


