2028 జాతర నాటికి పూర్తయ్యేనా? | - | Sakshi
Sakshi News home page

2028 జాతర నాటికి పూర్తయ్యేనా?

Sep 3 2026 8:23 AM | Updated on Sep 3 2026 8:23 AM

మేడారం మహాజాతరకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆ సమయంలో సమ్మక్క గుడి, సారలమ్మ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో జాతరకు ముందే నూతన ఆలయాల నిర్మాణం పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం కొత్త ఎస్టిమేషన్‌ రూపొందించి ఆమోదం కోసం పంపిన నేపథ్యంలో ప్రక్రియ పూర్తయి పనులు త్వరగా ప్రారంభిస్తే 2028 మేడారం జాతర నాటికి నిర్మాణాలను పూర్తి చేసే అవకాశం ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.

కన్నెపల్లిలోని సారలమ్మ గుడి(ఫైల్‌)

ఎస్‌ఎస్‌తాడ్వాయి: వనదేవతల నూతన ఆలయాల నిర్మాణంలో జాప్యం కొనసాగుతోంది. మేడారంలోని సమ్మక్క గుడి, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ. కోటి నిధులు మంజూరైనా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. టెండర్‌ ప్రక్రియ పూర్తయినప్పటికీ కాంట్రాక్టర్‌ కోట్‌ చేసిన రేట్లు, ప్రస్తుత అంచనా వ్యయానికి మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో టెండర్‌ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కొత్త రేట్లతో ఎస్టిమేషన్‌ రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదానికి సమర్పించినట్లు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. సంబంధిత అధికారులు పరిశీలించి ఆమోదించిన అనంతరం సీఎం కార్యాలయం నుంచి ఫైల్‌ రాగానే మళ్లీ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని చెబుతున్నారు.

వనదేవతలకు నిత్యం పూజలు

మేడారంలోని సమ్మక్క గుడి, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో జాతర సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వనదేవతలకు సంబంధించిన పూజలు, ఇతర ఆచార కార్యక్రమాలు ఇక్కడే కొనసాగుతాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయాలు చిన్నవిగా ఉండటంతో పూజా కార్యక్రమాల నిర్వహణలో పూజారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతర సమయంలో భక్తుల రద్దీ భారీగా ఉండటంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. మహాజాతర సమయంలో జాతరకు రెండు వారాల ముందు నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. ఆలయాల్లో పూజలు నిర్వహించిన తర్వాతనే కన్నెపల్లి నుంచి సారలమ్మ, చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెలకు తీసుకురావడం ఆనవాయితీ. ఇంత ప్రాధాన్యత ఉన్న అమ్మవార్ల ఆలయాల నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యమెందుకని పూజారులు, భక్తులు ప్రశ్నిస్తున్నారు.

సమ్మక్క–సారలమ్మ గుడులకు

రూ.కోటి మంజూరు

టెండర్‌ రద్దుతో నిలిచిపోయిన పనులు

ఇరుకై న ఆలయాల్లో పూజలు

ఇబ్బంది పడుతున్న పూజారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement