సమ్మక్క గుడి, సారలమ్మ ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తున్నాం. ఆలయాలు చిన్నవిగా ఉండటంతో పూజలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జాతర సమయంలో భక్తుల రద్దీతో సమస్య మరింత పెరుగుతుంది. నూతన ఆలయాలను త్వరగా నిర్మించి 2028 జాతర నాటికి పూర్తి చేయాలి. మంత్రి సీతక్క చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలి. నూతన ఆలయాలు అందుబాటులోకి వస్తే పూజారుల ఇబ్బందులు తొలగడంతో పాటు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
–కొక్కెర కృష్ణయ్య, సమ్మక్క పూజారి
●


