12న జాతీయ లోక్‌అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

12న జాతీయ లోక్‌అదాలత్‌

Sep 3 2026 8:23 AM | Updated on Sep 3 2026 8:23 AM

ములుగు: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12న శనివారం జిల్లాలోని కోర్టుల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.చండీశ్వరి దేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్‌ అదాలత్‌లో రాజీపడదగిన క్రిమినల్‌, సివిల్‌, ప్రీ–లిటిగేషన్‌ కేసులతో పాటు బ్యాంకు, విద్యుత్‌, భూ తగాదాలు, వివాహం–కుటుంబ వివాదాలు, మోటార్‌ వాహన ప్రమాదాలు, చిట్‌ఫండ్‌ తదితర కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కక్షిదారులు ఈ నెల 12న లోక్‌ అదాలత్‌కు హాజరై తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement