బాలికల విద్య దేశ సాధికారతకు పునాది | - | Sakshi
Sakshi News home page

బాలికల విద్య దేశ సాధికారతకు పునాది

Aug 29 2026 1:40 AM | Updated on Aug 29 2026 1:40 AM

ములుగు: బాలికలు విద్య దేశసాధికారతకు పునాది అని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలిసదన్‌ బాలికలు కలెక్టర్‌కు రాఖీ కట్టారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. బాలికను చదివిద్దాం– దేశాన్ని సాధికారత వైపు నడిపిద్దామనే నినాదంతో ముందుకెళ్లాలని అన్నారు. రక్షాబంధన్‌ పర్వదినా న్ని పురస్కరించుకొని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలసదనంలోని బాలికలు రాఖీ కట్టడం ఆనందంగా ఉందన్నారు. బాలికలను ఆప్యాయంగా పలకరించి అశీర్వదించారు. అనంతరం బాలికలకు మిఠాయిలు అందజేశారు. క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాల ని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఈసంపెల్లి ప్రేమలత, బాలల సహాయవాణి జిల్లా సమన్వయక కర్త నరేష్‌, బాలసదనం సిబ్బంది అరుణ, రాణి, సఖి కేంద్రం సిబ్బంది లావణ్య, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement