● ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ ధర్మ
గణపురం: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి పెద్ద చెరువుల్లో ఒక్కటైన గణపసముద్రం చెరువు ఆయకట్టు కాల్వల మరమ్మతులకు ప్రభుత్వం రూ.31 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఐబీ ఇరిగేషన్‌శాఖ సీఈ ధర్మ తెలిపారు. శుక్రవారం గణపసముద్రం ఆయకట్టు కాల్వలను స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తడి కాల్వ, పైడి కాల్వ, కోట కాల్వ, కొత్త కాల్వల అభివృద్ధికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గణపసముద్రం చెరువు ఆయకట్టు కాల్వల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతాంగానికి సాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందేందుకు కాల్వల మరమ్మతు పనులు ప్రారంభిస్తామన్నారు. మరో పదిరోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రాము, ఎస్‌సీ మోహన్ రావు, ఏఈలు సమ్మారావు, శ్రీనివాస్, సర్పంచ్ కట్కూరి రాధికశ్రీనివాస్, రైతులు ఉన్నారు.


