ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి

Aug 12 2026 3:04 AM | Updated on Aug 12 2026 3:04 AM

ములుగు రూరల్‌: దేశభక్తి స్ఫూర్తితో ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ నాయకులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో జాతీయ జెండాను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ నెల 13న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలో తిరంగ్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ జెండా మనదేశ గౌరవం, ఐక్యతకు ప్రతీక అని వివరించారు. హర్‌ ఘర్‌ తిరంగ్‌ భారతీయుల్లో దేశభక్తి భావం పెంపొందిస్తుందని వెల్లడించారు. జాతీయ జెండాలకు ఇంటింటికీ అందించే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే తిరంగ్‌ ర్యాలీకి విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్య జవహర్‌లాల్‌, రవీంద్రచారి, వెంకట్‌, నగరపు రమేశ్‌, రాజునాయక్‌, కృష్ణాకర్‌, రాయంచు నాగరాజు, కుమార్‌, శ్రీకాంత్‌, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement